- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమా కోసం మరోసారి కొత్త అవతారం ఎత్తిన స్టార్ హీరో ధనుష్..? వైరల్ అవుతున్న న్యూస్
దిశ, సినిమా: సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఓల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శేఖర్ కమ్ముల తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
ధనుష్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ధనుష్ యాక్టర్‌తో పాటు సింగర్ అవతారం కూడా ఎత్తినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ఎంట్రో సాంగ్‌ను ఆయనే స్వయంగా పాడినట్లు తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కర్ భట్ల సాహిత్యం అందించాడు. ఇక ఈ సాంగ్‌ను చెన్నైలోని ఓ స్టూడియోలో రికార్డు కూడా చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే పాట విడుదల అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.