AUS vs IND: ‘కంగారు’ పెట్టిస్తోన్న బుమ్రా.. కుప్పకూలిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్

by Gantepaka Srikanth |
AUS vs IND: ‘కంగారు’ పెట్టిస్తోన్న బుమ్రా.. కుప్పకూలిన ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెల్‌బోర్న్(Melbourne) వేదికగా ఇండియా, ఆస్ట్రేలియా(AUS vs IND) మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టులో టీమిండియా(Team India) స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) రెచ్చిపోయారు. బుమ్రా దెబ్బకు ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. నితీశ్‌కుమార్‌ రెడ్డి(114) సెంచరీ చేయడమే కాకుండా జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 93 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. 198 లీడ్‌లో కొనసాగుతోంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు, మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) రెండు వికెట్లు తీశారు. దీంతో అత్యంత వేగంగా 200+ వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించారు.

Advertisement

Next Story

Most Viewed