RRR: రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో ముందడుగు

by Gantepaka Srikanth |
RRR: రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో ముందడుగు
X

దిశ, వెబ్‌డెస్క్: రీజినల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ నార్త్(Hyderabad North) పార్ట్‌కి టెండర్లు కేంద్రం పిలిచింది. నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే(Four Lane Expressway)కి టెండర్ల ఆహ్వానం పలికింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్‌ నుంచి యాదాద్రి వరకు రూ.5,555 కోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించింది. 161.5 కి.మీటర్ల రోడ్డు నిర్మాణ పనులను రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని కేంద్రం నిబంధన పెట్టింది.

ఇదిలా ఉండగా.. సంగారెడ్డి జిల్లా గిర్మ్‌పూర్ గ్రామం నుండి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు.. రెడ్డిపల్లి గ్రామం నుండి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు.. ఇస్లాంపూర్ నుండి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు.. సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు.. మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్రం టెండర్లు పిలిచింది. హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను మరింత వేగంగా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటానికి రీజినల్ రింగు రోడ్డు (RRR) నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి ఇది సూపర్ గేమ్ ఛేంజర్ అని.. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed