ఐపీఎల్‌లో శ్రీశాంత్ రీఎంట్రీ.. పదేళ్ల తర్వాత..

by Vinod kumar |
ఐపీఎల్‌లో శ్రీశాంత్ రీఎంట్రీ.. పదేళ్ల తర్వాత..
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023లో కేరళ పేస్ సంచలనం శ్రీశాంత్ రీఎంట్రీ ఖరారైంది. 2013 ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత క్రికెట్ దూరమైన శ్రీశాంత్.. పదేళ్ల విరామం తర్వాత తిరిగి ఐపీఎల్‌లో కనిపించబోతున్నాడు. అయితే ఈసారి క్రికెటర్‌గా కాకుండా క్రికెట్ వ్యాఖ్యతగా కావడం విశేషం. ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన స్టార్ స్పోర్ట్స్ తాజాగా ప్రకటించిన కామెంటేటర్ల జాబితాలో శ్రీశాంత్ కూడా ఉన్నాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈసారి ఐపీఎల్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసుకున్న మాజీ క్రికెటర్ల జాబితాలో శ్రీశాంత్‌కు కూడా స్ధానం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

స్టార్ స్పోర్ట్స్ ఎంచుకున్న కామెంటేటర్ల జాబితాలో శ్రీశాంత్‌తో పాటు జాక్వెస్ కల్లిస్, ఆరోన్ ఫించ్, కెవిన్ పీటర్సన్, టామ్ మూడీ, ఇర్ఫాన్ పఠాన్, ఎస్ శ్రీశాంత్, ఇర్ఫాన్ పఠాన్, పాల్ కాలింగ్‌వుడ్, హర్భజన్ సింగ్, మురళీ విజయ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజ క్రికెటర్లు కూడా ఉన్నారు. వారితో కలిసి ఈసారి కామెంట్రీ బాక్సులో శ్రీశాంత్ దర్శనమివ్వబోతుండటం ఆయన అభిమానుల్లో సంతోషం నింపుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన శ్రీశాంత్ తిరిగి కామెంటేటర్ పాత్రలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా సందడి చేయబోతున్నాడు. రియాల్టీ షోలతో అభిమానుల్ని సంపాదించుకున్న శ్రీశాంత్ ఐపీఎల్ రీఎంట్రీలో ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

Advertisement

Next Story