ఇండియాలో మొట్ట‌మొద‌టి సారి 'మంచు మార‌థాన్‌', ఎక్క‌డా ఏంటీ..?!

by Sumithra |
ఇండియాలో మొట్ట‌మొద‌టి సారి మంచు మార‌థాన్‌, ఎక్క‌డా ఏంటీ..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇండియా స్పోర్ట్స్ అన‌గానే క్రికెట్‌, టెన్నీస్‌, బ్యాట్మింట‌న్‌తో పాటు ప‌లు క్రీడ‌లు ముందు వ‌రుస‌లో క‌నిపిస్తాయి. అయితే, పాశ్చ‌త్య దేశాల్లో ఫేమ‌స్ అయిన కొన్ని క్రీడ‌ల్లో ఇండియా ఇప్పుడిప్పుడే త‌న స‌త్తాను చాటుకుంటుంది. సాహ‌సోపేత‌మైన క్రీడ‌ల్లో ఇండియన్ క్రీడాకారులు ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ గుర్తింపును పొందారు. ఇందులో భాగంగా ఇండియా కొన్ని ప్ర‌త్యేక అంత‌ర్జాతీయ క్రీడ‌ల‌కు వేదిక‌గా మారుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా భారతదేశపు మొట్టమొదటి స్నో మారథాన్ మార్చి 26న లాహౌల్‌లో ప్రారంభమ‌య్యింది. ఈ కార్యక్రమం రీచ్ ఇండియా, లాహౌల్, స్పితి అడ్మినిస్ట్రేష‌న్‌తో కలిసి సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నారు. భారత‌దేశంలో తొలిసారిగా నిర్వ‌హిస్తున్న ఈ స్నో మారథాన్‌నుపై స‌ర్వ‌త్ర హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

మనాలి సమీపంలోని పల్చన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో లాహౌల్, స్పితి డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో స్నో మారథాన్ నిర్వహించడం ఇదే తొలిసారి అని, మంచు మారథాన్ క్రీడ‌ను సవాలుగా తీసుకొని నిర్వ‌హిస్తున్నట్లు చెప్పారు.

ఇందులో నాలుగు విభాగాలు ఉన్నాయి: పూర్తి మారథాన్ 42 కి.మీ., హాఫ్ మారథాన్ 21 కి.మీ., హాఫ్ మారథాన్ 10 కి.మీ., హాఫ్ మారథాన్ 5 కి.మీ.

ఫీజు వివరాలు: పూర్తి మారథాన్ (42.195 కి.మీ) – రూ. 5000, హాఫ్ మారథాన్ (21.095 కి.మీ) -రూ. 2500, 10K రేస్ (10 కి.మీ) – రూ. 1500, 5K రేస్ (5 కిమీ) – రూ 1000, జాయ్ రేస్ (1 కి.మీ) – రూ. 500

Advertisement

Next Story