- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డోపింగ్‌లో పట్టుబడ్డ స్టార్ అథ్లెట్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా అథ్లెట్, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వి.కె విస్మయ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. నాడా నిర్వహించిన డోప్ టెస్టులో ఆమె విఫలమైంది. ఈ ఏడాది ఆగస్టులో నాడా ఆమె నుంచి శాంపిల్ సేకరించింది. శాంపిల్‌లో నిషేధిత క్లోమిఫెన్‌ను గుర్తించారు. క్లోమిఫెన్ అనేది మహిళల్లో గర్భధారణ హార్మోన్లను ఉత్తేజపరుస్తుంది.నిషేధిత పదార్థాన్ని ఉపయోగించినట్టు విస్మయ అంగీకరించింది. ఆమెపై నాడా తాత్కాలికంగా నిషేధం విధించింది. విస్మయతోపాటు సునీత, ముస్కాన్ రాణా, ప్రవీణ్ కుమార్ కూడా డోప్ టెస్టులో పట్టుబడ్డారు. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో హిమ దాస్, పూవమ్మ, సరితాబెన్ గైక్వాడ్‌లతో కలిసి విస్మయ మహిళల 4×400 మీటర్ల రిలే ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. అలాగే, 2019లో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్‌లో మహిళల, మిక్స్‌డ్ రిలే ఈవెంట్లలో రజతం గెలుచుకుంది.
Advertisement
- Tags
- #doping
Next Story