4x400 మీటర్ల రిలే రేసులో భారత జట్లకు ఒలింపిక్స్ బెర్త్

by Harish |
4x400 మీటర్ల రిలే రేసులో భారత జట్లకు ఒలింపిక్స్ బెర్త్
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు 4x400 మీటర్ల రిలే రేసులో భారత పురుషుల, మహిళల జట్లు అర్హత సాధించాయి. బహామాస్‌లో సోమవారం జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ రిలేస్ టోర్నీలో భారత జట్లు ఒలింపిక్స్ బెర్తులు ఖాయం చేసుకున్నాయి. పురుషుల 4x400 మీటర్ల రిలే కేటగిరీలో ముహమ్మద్ అనాస్ యాహియా, ముహమ్మద్ అజ్మల్, అరోకియా రాజీవ్, అమోజ్ జాకబ్‌లతో కూడిన భారత జట్టు 3:03.23 సెకన్ల సీజన్ బెస్ట్ ప్రదర్శన చేసి రెండో స్థానంలో నిలిచింది. అమెరికా(2:59.95 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచింది. రూపాల్ చౌదరి, జ్యోతిక, పూవమ్మ, శుభా వెంకటేసన్‌లతో కూడిన మహిళల 4x400 మీటర్ల రిలే కూడా రెండో స్థానంలో నిలిచింది. భారత జట్టు 3:29.35 సెకన్లతో రేసును ముగించింది. అంతకుముందే జమైకా(3:28.54 సెకన్లు)తో లక్ష్యాన్ని చేరుకుని టాప్‌ పొజిషన్‌లో నిలిచింది. ప్రతి హీట్ నుంచి టాప్-2 జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి.

Advertisement

Next Story

Most Viewed