Madan Lal: 'ఈసారి ఆసియా కప్‌ భారత్‌దే.. కానీ వరల్డ్‌కప్‌ మాత్రం'

by Vinod kumar |
Team India
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌-2023 ఎవరు గెలుస్తారు అనే విషయంపై బీసీసీఐ మాజీ సెలక్టర్‌ మదన్‌ లాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా కచ్చితంగా ఆసియా కప్‌ గెలుస్తుంది. కానీ.. ప్రపంచకప్‌ విజేత గురించి ఇప్పుడే అంచనా వేయలేమని.. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికాలకు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో ఆడటం మనకు సానుకూలాంశమే అయినా.. అదే ప్రతికూలంగానూ మారే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఆడుతున్నపుడు భారీ అంచనాల కారణంగా ఒత్తిడి ఉండటం సహజం.

అయితే మన జట్టులో ఎక్కువ మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లే ఉన్నారు. ఒత్తిడిని ఎలా అధిగమించాలో వారికి బాగా తెలుసు’’ అని మదన్‌ లాల్‌ పేర్కొన్నారు. రాహుల్‌, అయ్యర్‌లకు గత అనుభవం ఉన్నా.. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఎలా రాణిస్తారన్నదే కాస్త ఆందోళన కలిగించే అంశమని మాజీ ఆల్‌రౌండర్‌ మదన్‌ లాల్‌ చెప్పుకొచ్చాడు. Asia Cup 2023 ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement

Next Story