పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్‌ కోసం రెజ్లర్లకు చివరి చాన్స్

by Harish |
పారిస్ ఒలింపిక్స్‌ బెర్త్‌ కోసం రెజ్లర్లకు చివరి చాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో రేపటి నుంచి 12వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ రెజ్లింగ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో 14 మంది భారత రెజ్లర్లు బరిలో ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఈ టోర్నీనే చివరి అవకాశం. ఇప్పటి వరకు రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగు బెర్త్‌లు దక్కాయి. అన్నీ మహిళలే సాధించడం గమనార్హం.

ఈ ఈవెంట్‌‌లో అమన్ సెహ్రావత్(57 కేజీలు), దీపక్ పూనియా(86 కేజీలు)పై భారీ అంచనాలు ఉన్నాయి. వీరితోపాటు పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో సుజీత్(65 కేజీలు), జైదీప్(74కేజీలు), దీపక్(97 కేజీలు), సుమిత్(125 కేజీలు) అదృష్టం పరీక్షించుకోనున్నారు. మహిళల ఫ్రీస్టైల్ విభాగంలో మాన్సీ(62 కేజీలు), నిషా(68 కేజీలు) పాల్గొంటున్నారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో సుమిత్(60 కేజీలు), అషు(67 కేజీలు), వికాస్(77 కేజీలు), సునీల్ కుమార్(87 కేజీలు), నితేశ్(97 కేజీలు), నవీన్(130 కేజీలు) పోటీపడనున్నారు. ప్రతి వెయిట్ విభాగంలో ముగ్గురు పారిస్ విశ్వక్రీడలకు అర్హత సాధించొచ్చు. ఇద్దరు ఫైనలిస్టులతోపాటు ఇద్దరు కాంస్య పతక విజేతల మధ్య జరిగే ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ ద్వారా మరొకరికి అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed