- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిఫా ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు కోల్పోయిన భారత్
దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు పేలవ ప్రదర్శన ఫిఫా ర్యాంకింగ్స్‌పై పడింది. గురువారం ఫిఫా రిలీజ్ చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ ఏకంగా 15 స్థానాలను కోల్పోయింది. గత ర్యాంకింగ్స్‌లో 35.63 రేటింగ్ పాయింట్లను నష్టపోయింది. గతేడాది డిసెంబర్ 21న విడుదలైన ర్యాంకింగ్స్‌లో 102వ స్థానంలో ఉన్న భారత్ తాజా ర్యాంకింగ్స్‌లో 117వ ర్యాంక్‌కు పడిపోయింది. ఏడేళ్లలో భారత్ ర్యాంక్ ఇంత దారుణంగా పడిపోవడం ఇదే తొలిసారి. 2017 జనవరిలో జట్టు 129వ ర్యాంక్‌లో ఉంది. అలాగే, ఆసియా దేశాల్లో భారత్ 22వ ర్యాంక్‌లో ఉంది. అర్జెంటీనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. కాగా, ఇటీవల ఆసియా కప్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూపు దశలోనే వెనుదిరిగింది. ఈ మూడు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం.
- Tags
- #FIFA Rankings