- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra: రెబల్స్‌ను ఒప్పించడంలో ఎంవీఏ సక్సెస్.. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్
దిశ, నేషనల్ బ్యూరో: మహా వికాస్ అఘాడీ (MVA) అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన 90 శాతం స్థానాల్లో రెబల్స్‌ను ఒప్పించడంలో కూటమి విజయం సాధించిందని శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay raut) తెలిపారు. బుధవారం ఆయన ముంబై(Mumbai)లో మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ మొత్తం 96 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ఎంవీఏ ప్రయత్నిస్తోందని, అది జరగాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని తెలిపారు. 90 శాతం సీట్లలో అసంతృప్తితో ఉన్న అభ్యర్థులను శాంతింపజేశామన్నారు. నామినేషన్ విత్ డ్రా చివరి తేదీ వరకు మరికొంత మందిని బుజ్జగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. మూడు కీలక పార్టీలు కలిసి బరిలోకి దిగుతున్నప్పుడు ఇవన్నీ సహజమేనని తెలిపారు.
పరిమిత సీట్ల వల్ల పార్టీలతో పాటు కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ స్పష్టమైన మెజారిటీ సాధించడం ఖాయమని నొక్కి చెప్పారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 20వ తేదీన జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే పలు స్థానాల్లో టికెట్ ఆశించిన నాయకులు వారికి టికెట్ రాకపోవడంతో రెబల్స్‌గా బరిలోకి దిగారు. దీంతో అన్ని పార్టీల నేతలు వారిని బుజ్జగించి నామినేషన్ విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.