IND Vs AUS: ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా

by Shiva |
IND Vs AUS: ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవస్కర్ ట్రోఫీ 2024 (Border-Gavaskar Trophy 2024)లో భాగంగా బ్రిస్బేన్ (Brisbane) వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా (Australia) భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ముందుగా టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, వర్షం కారణంగా మొదటి రోజు ఆటను 13.2 ఓవర్ల వద్ద అంపైర్లు నిలిపివేశారు. అనంతరం రెండో రోజు 28 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసిస్ వెంటవెంటనే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఒపెనర్లు ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) (21), నాథన్ మెక్‌స్వీని (Nathan McSweeney) (9)లను జస్ప్రీత్ బుమ్రా అద్భుత బంతులతో పెవీలియన్‌కు పంపాడు. ప్రమాదకర బ్యాట్స్‌మెన్ మార్నస్ లబుషేన్‌ (Marnus Labuschagne) వికెట్ తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తీసుకున్నాడు.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చి ట్రావిస్ హెడ్ (Travis Head), స్టీవ్ స్మిత్‌ (Steven Smith)లు మెల్లిమెల్లిగా పరుగులు రాబడుతూ.. ఆ తరువాత స్కోర్ బోర్టును భారీ షాట్లతో పరిగెత్తించారు. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ (Steven Smith) 190 బంతుల్లో 101 పరుగులు చేసిన జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ (Travis Head) 160 బంతుల్లో 152 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లోనే పెవీలియన్ చేరాడు. ఇక భారత బౌలర్లలో స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా (Jasprit Bumrah) 5 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia) 6 వికెట్లను కోల్పోయి 348 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (Alex Carey) (14), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ Pat Cummins (8) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed