- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arvind Kejriwal : ‘న్యూఢిల్లీ’ బరిలో కేజ్రీవాల్.. కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ.. ఆప్ నాలుగో లిస్ట్
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Polls) కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం నుంచి ముఖ్యమంత్రి అతిషి, గ్రేటర్ కైలాశ్ స్థానంలో సౌరభ్ భరద్వాజ్, బాబర్ పూర్ నుంచి గోపాల్ రాయ్, బల్లి మారన్ నుంచి ఇమ్రాన్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. న్యూఢిల్లీ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. అక్కడి నుంచి దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అందుకే ఈ స్థానాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనూ అమీతుమీకు తాము సిద్ధమేననే సంకేతాలను పంపేందుకు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ అధినేత ఎంచుకున్నట్లు సమాచారం. అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పటివరకు మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని వెల్లడించింది. ‘‘బీజేపీ మిస్సింగ్.. ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదు’’ అంటూ ఆప్ విమర్శలు గుప్పించింది. గత ఐదేళ్లలో కేజ్రీవాల్‌ను తిట్టడం తప్ప, ఢిల్లీ కోసం బీజేపీ ఏమీ చేయలేదని కేజ్రీవాల్ పార్టీ దుయ్యబట్టింది. ఢిల్లీ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న ఆప్‌కే ప్రజలు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేసింది.