Sesame Seeds: చలికాలంలో నువ్వులు ఆరోగ్యానికి మంచివేనా?

by Prasanna |
Sesame Seeds: చలికాలంలో నువ్వులు ఆరోగ్యానికి మంచివేనా?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా చలికాలంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. ఇలాంటి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆహరం శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా, చలి ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వులను ( Sesame Seeds ) తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వుల వలన ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం ..

చలికాలంలో నువ్వులు తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. నువ్వులు నార్మల్ గానే వేడి గుణాన్ని కలిగి ఉంటాయి. తెల్ల నువ్వులను తినడం వలన వెచ్చగా ఉంటుంది. దీనిని పాలతో కానీ, లడ్డులా కానీ చేసుకుని తినొచ్చు.

చలికాలంలో చాలా మంది దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధ పడతారు. తెల్ల నువ్వులను రోజూ తీసుకోవడం వల్ల ఇమ్మ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీనిలో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, సినిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story