- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమ్ ఇండియా-ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే..
దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. ఈ 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇక వన్డే సమరం మొదలు కానుంది. మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో భారత జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబై, విశాఖపట్నం, చెన్నైలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. స్వదేశంలో జరుగనున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. అతని స్థానంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సారథిగా వ్యవహరించనన్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన తల్లి మరణం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టనున్నాడు.
భారత్-ఆస్ట్రేలియా ODI సిరీస్ షెడ్యూల్:
మార్చి 17- మొదటి వన్డే (వాంఖడే స్టేడియం, ముంబై)
మార్చి 19 – రెండవ ODI (YSR స్టేడియం, విశాఖపట్నం)
మార్చి 22- మూడో వన్డే (MA చిదంబరం స్టేడియం, చెన్నై)
భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా (విసి), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, డబ్ల్యూ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనద్కత్. (రోహిత్ 1వ వన్డేకు దూరమవుతాడు.. అతని స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు)
ఆస్ట్రేలియా వన్డే జట్టు:
స్టీవ్ స్మిత్ (సి), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్, అష్టన్ అగర్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ జంపా.