IND VS AUS 1st ODI: డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత..

by Vinod kumar |
IND VS AUS 1st ODI: డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత..
X

దిశ, వెబ్‌డెస్క్: మొహాలీ వేదికగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో సిక్సర్ల సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన వార్నర్‌.. అంతర్జాతీయ వన్డేల్లో 100 సిక్సర్లు బాదిన 43వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ఈ సిక్సర్‌తో పాటు మరో సిక్సర్‌ కూడా బాది తన సిక్సర్‌ల సంఖ్యను 101కి (148 మ్యాచ్‌ల్లో) పెంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న వార్నర్‌ 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు​ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (331), రోహిత్‌ శర్మ (286), సనత్‌ జయసూర్య (270), ఎంఎస్‌ ధోని (229) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed