‘గుడ్‌ బై మై డియర్ లైట్ హౌస్.. ’ టాటా మరణంపై శంతను ఎమోషనల్ పోస్ట్

by karthikeya |   ( Updated:2024-10-10 13:11:28.0  )
‘గుడ్‌ బై మై డియర్ లైట్ హౌస్.. ’ టాటా మరణంపై శంతను ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘నీ నిష్క్రమణతో మన స్నేహంలో ఏర్పడిన లోటు ఎన్నటికీ తీరనిది. నా మిగిలిన జీవితం మొత్తం ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. గుడ్ బై మై డియర్ లైట్ హౌస్’’. రతన్ టాటా మరణం తర్వాత ఆయన యువ స్నేమితుడు శాంతను నాయుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కాగా.. కొన్నేళ్ల నుంచి రతన్ టాటా, శంతను నాయుడు మంచి స్నేహితులుగా ఉన్నారు. వీరిద్దరి స్నేహం కూడా ఓ రకంగా హాట్ టాపిక్ అనే చెప్పాలి. దేశం గర్వించదగ్గ బిలియనీర్ బిజినెస్‌మెన్ రతన్ టాటాతో ఈ కుర్రాడికి స్నేహం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ వాటిని పట్టించుకోకుండా వీరిద్దరి స్నేహం చాలా ఏళ్ల పాటు కొసాగింది. 2018 నుంచి శంతను రతన్‌టాటాకు అసిస్టెంట్‌గా ఉంటున్నారు. టాటా ట్రస్ట్‌లో యంగెస్ట్ జనరల్‌ మేనేజర్‌గా, టాటాకు అత్యంత నమ్మకస్తుడైన అసిస్టెంట్‌గా శంతనుకు మంచి పేరుంది.

అయితే వీరిద్దరి మధ్య స్నేహం పెరగడానికి కారణం మాత్రం వీధి కుక్కలపై ఉన్న ప్రేమే. అలా 80ల్లో ఉన్న రతన్ టాటాకి, 20ల్లో ఉన్న శంతనుకు మధ్య ఓ విడదీయలేని బాండింగ్ ఏర్పడింది. కాగా.. టాటా సంస్థ అధినేత, టాటా గ్రూప్ గౌవర అధ్యక్షుడు రతన్ టాటా నిన్న (బుధవారం) అర్థరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story