- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Cabinet: రతన్ టాటాకు ఏపీ కేబినెట్ సంతాపం.. అజెండా వాయిదా
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) ప్రారంభమైంది. బిజినెస్ దిగ్గజం రతన్ టాటా (86) మృతి (Ratan Tata Demise) పట్ల ఏపీ మంత్రులంతా సంతాపం తెలిపారు. అనంతరం అజెండాను వాయిదా వేసి.. కేబినెట్ సమావేశాన్ని ముగించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రతన్ టాటా భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ముంబైకి బయల్దేరారు. మధ్యాహ్నం 1.50కి ముంబైకి చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ముంబైలోని ఎన్సీపీఏ గ్రౌండ్ లో రతన్ టాటా పార్థివ దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం తరఫున హోంమంత్రి అమిత్ షా (Amit Shah).. టాటా అంత్యక్రియలకు (Ratan Tata Funerals) హాజరు కానున్నారు.