సోషల్ మీడియాలో కొత్త చర్చ.. అనిరుధ్, తమన్ లే హాట్ టాపిక్!

by Sumithra |   ( Updated:2024-10-10 06:48:55.0  )
సోషల్ మీడియాలో కొత్త చర్చ.. అనిరుధ్, తమన్ లే హాట్ టాపిక్!
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో ఆ ఇద్దరు హీరోల అభిమానుల కన్ను వారిద్దరి రాబోయే సినిమాల పై పడింది. అయితే ఇటీవల కాలంలో తారక్ దేవర పార్ట్-1 చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇక త్వరలోనే రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ సినిమాతో థియేటర్లలో సందడి చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో కొత్త హాట్ టాపిక్ నడుస్తుంది. గేమ్ ఛేంజర్, దేవర, సినిమాల మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, అనిరుధ్ రవిచందర్ వర్క్ మధ్య తెగ కంపేరిజన్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. మ్యూజికల్ పరంగా అనిరుధ్, తమన్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. అయితే తమన్ ఇప్పటి వరకు చేసిన అనేక సినిమాలకు మంచి అవుట్ పుట్ నే ఇచ్చారంటున్నారు. కానీ అనిరుధ్ వర్క్ అంతగా చేయలేకపోతున్నారని కామెంట్లు పెడుతున్నారు.

దానికి ఉదాహరణ కూడా చెబుతున్నారు. దేవర చిత్రంలో పాటలన్నీ చార్ట్ బస్టర్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే మొదటి రెండు పాటలు చుట్టమల్లెకు, ఫియర్ పాటకు ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఆ రెండు పాటలు చాలా మందికి ఫేవరెట్ జాబితాలో చేరిపోయాయి. అంతే కాదు మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల గేమ్ ఛేంజర్ నుంచి కూడా రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆ రెండు పాటలు దేవర మూవీ పాటల లాగా క్రేజ్ సంపాదించుకోలేకపోయాయనే చెప్పాలి. మ్యూజిక్ లవర్స్ ను ఆ రెండు పాటలు ఆకట్టుకున్నా దేవర సినిమా పాటలంతా మాత్రం కాదంటున్నారు అభిమానులు. టాలీవుడ్ సినిమాలకు ఇప్పటి వరకు అదిరిపోయే సంగీతాన్ని అందించిన తమన్.. గేమ్ ఛేంజర్ సినిమాకు మాత్రం అనుకున్న రేంజ్ లో సంగీతాన్ని అందించినట్లు కనపడటం లేదంటున్నారు నెటిజన్లు.

Also Read: సూపర్ స్టైలిష్‌గా స్టార్ హీరో.. ట్రెండింగ్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ వర్కింగ్ స్టిల్‌

Advertisement

Next Story