Custard apple : సీతాఫలం.. ఆరోగ్య ప్రదం.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?

by Javid Pasha |
Custard apple : సీతాఫలం.. ఆరోగ్య ప్రదం.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సీత వంటి అందమైన స్త్రీ, సీతాఫలం వంటి రుచికరమైన పండు ఈ భూమిపైనే లేవని పెద్దలు అంటుంటారు. ఇది నానుడి కావచ్చునేమో కానీ.. నిజంగానే సీతా ఫలం రుచికీ, ఆరోగ్యానికీ చాలా మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు. అడవులు, గ్రామీణ ప్రాంతాల్లో సహజంగానే లభించే ఈ సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు కొనుక్కొని తినేవారికి సిటీల్లోనూ ఫుల్లుగా లభిస్తున్నాయి. చూడటానికి అట్రాక్ట్‌గా, తినడానికి టేస్టీగా ఉంటాయి. అయితే వీటిని తినడంవల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

* సీతా ఫలాల్లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డీహైడ్రేషన్, ఒత్తిడి వంటి సమస్యలను, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనారోగ్యాలను నివారిస్తాయి. వీటిలో ఉండే కౌరినోయిక్ యాసిడ్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వంటి సమ్మేళనాలు దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెప్తున్నారు.

*మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు కలిగి ఉండటంవల్ల సీతా ఫలాలు తింటే రక్తనాళాలు ఉత్తేజితం అవుతాయి. అధిక రక్తపోటును తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్, పక్షవాతం వంటి సమస్యలనుు నివారించడంలో సీతా ఫలం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఫైబర్ కంటెంట్ ఉండటం కారణంగా సీతా ఫలాలు అతిసారం, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను అరికడతాయి.

* సీతా ఫలాల్లో ఉండే నియాసిన్ విటమిన్ హై కొలెస్ట్రాల్ లెవల్స్‌ను సమతుల్యం చేస్తుంది. దీంతో అధిక బరువు, ఊబకాయం, స్ట్రోక్, గుండె జబ్బులు వంటి రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆస్తమా ఉన్నవారు సీతాఫలం తినకూడదని కొందరు అపోహ పడుతుంటారు. కానీ సీతాఫలంలోని విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటంవల్ల ఇవి ఆస్తమా నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే యాపిల్ పండ్లకంటే కూడా సీతాఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలే అధికమని కూడా చెప్తుంటారు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే పోషకాహార నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story