- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు పెళ్ళి పీటలెక్కబోతున్న 40 ఏళ్ల టాలీవుడ్ హీరో.. అమ్మాయి ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ‘బాణం’ అనే తన ఫస్ట్ మూవీతోనే మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ‘సోలో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రౌడీ ఫెలో, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఒక్కడినే, ప్రతినిధి, అసుర, రాజా చేయి వేస్తే, జో అచ్చుతానంద, శంకర, శమంతక మణి, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, ఆటగాళ్లు, వీర భోగ వసంత రాయలు, ప్రతినిధి 2.. ఇలా పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
అలా వరుస సినిమాలతో ఓ మెరుపు మెరిసిన నారా రోహిత్.. 2018 తర్వాత సుమారు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని.. ఈ ఏడాది ‘ప్రతినిధి 2’ మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. త్వరలోనే ఈ నారా వారబ్బాయి ఓ ఇంటి వాడు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ టాలీవుడ్ బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడని రూమర్లు వినిపిస్తున్నాయి.
అందులో భాగంగా ఈ నెల 13న నారా రోహిత్ నిశ్చితార్థం జరగనుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ హీరో నటించిన ప్రతినిధి -2 సినిమాలోని హీరోయిన్ సిరి లేళ్లతో ఉంగరాలు మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీలు కూడా హాజరు కాబోతున్నాయని సమాచారం. అయితే నారా రోహిత్ నిశ్చితార్థం, పెళ్లి గురించి హీరో నుంచి కానీ అతని కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
(video link credits siree lella instagram id)