Dasoju Sravan: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన దాసోజు శ్రవణ్.. హాజరైన బీఆర్ఎస్ నేతలు

by Shiva |
Dasoju Sravan: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన దాసోజు శ్రవణ్.. హాజరైన బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, పద్మారావుగౌడ్‌ హాజరయ్యారు.



Next Story

Most Viewed