Single Movie: ‘సిర్రాకైంది సింగిల్ బతుకు’ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు.. హె సింగిల్స్ గెట్ రెడీ టు ఫ్రస్టేషన్ ఆంతమ్ అంటూ పోస్ట్

by Kavitha |   ( Updated:2025-04-17 13:21:14.0  )
Single Movie: ‘సిర్రాకైంది సింగిల్ బతుకు’ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు.. హె సింగిల్స్ గెట్ రెడీ టు ఫ్రస్టేషన్ ఆంతమ్ అంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), కార్తీక్ రాజు(Karthik Raju) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single). అయితే దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీస్ ఇవానా(Ivana), కేతిక శర్మ(Kethika Sharma)లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్(Vennela Kishore) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrashekhar) సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస అప్డేట్ ఇస్తూ మూవీపై మరింత హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘సిర్రాకైంది సింగిల్ బతుకు’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో సింగిల్స్‌ మనసును కదిలించేలా ఉంది. ఇక ఈ ప్రోమో వీడియోను షేర్ చేస్తూ.. ‘హె సింగిల్స్.. గెట్ రెడీ టు వైబ్ టు యువర్ ఫ్రస్టేషన్ ఆంతమ్.. హైలీ ఎనర్జిటిక్ ప్రోమో వచ్చేసింది’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. కాగా ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం 4:05 నిమిషాలకు రానున్నది.

Next Story

Most Viewed