షాకింగ్ టైటిల్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ..

by Sumithra |   ( Updated:2024-10-10 10:48:58.0  )
షాకింగ్ టైటిల్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన మూవీ హను మాన్ విజ‌యవంతం కావడంతో మంచి జోష్‌లో ఉన్నాడు. అదే ఉత్సాహంతో వ‌రుస‌ సినిమాల‌ను ప్ర‌క‌టిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. తాజాగా త‌న సినిమాటిక్ యూనివ‌ర్స్ ( పీవీసీయూ ) నుంచి ఓ కొత్త అప్‌డేట్ ఇచ్చాడు. సినిమాటిక్ యూనివర్స్ ( పీవీసియూ) నుంచి ప్రశాంత్ వర్మ మూడో సినిమానికి సంబంధించిన ఓ కొత్త అప్‌డేట్ ను దేవి నవరాత్రుల్లో అనౌన్స్ చేశారు.

“మహా కాళీ” అనే సినిమా టైటిల్ ని హనుమాన్ యూనివర్స్ కి అనుసంధానం చేస్తూ అనౌన్స్ చేశారు. అనౌన్సమెంట్ వీడియో కూడా అందరినీ ఆకట్టుకునేలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లేడీ దర్శకురాలు పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకురాలిగా వర్క్ చేయగా, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story