Hockey: జర్మనీ, స్పెయిన్ టూర్లకు భారత మహిళల హాకీ జట్టు ఎంపిక..

by Vinod kumar |
Hockey: జర్మనీ, స్పెయిన్ టూర్లకు భారత మహిళల హాకీ జట్టు ఎంపిక..
X

న్యూఢిల్లీ : ఈ నెలలో భారత మహిళల హాకీ జట్టు మూడు మ్యాచ్‌ల కోసం జర్మనీలో, నాలుగు దేశాల టోర్నీ కోసం స్పెయిన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత మహిళల హాకీ జట్టును హాకీ ఇండియా మంగళవారం ప్రకటించింది. కెప్టెన్, గోల్‌కీపర్ సవిత నాయకత్వంలో 20 మంది కూడిన జట్టును వెల్లడించింది. డిఫెండర్ డీప్ గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. గత సిరీస్ కోసం మేలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన జట్టే జర్మనీ, స్పెయిన్‌ టూర్లకు వెళ్లనుంది. అయితే, ఆసిస్ పర్యటనకు విశ్రాంతి ఇచ్చిన సీనియర్ డిఫెండర్ సుశీల చాను, ఫార్వర్డ్ దీపిక తిరిగి జట్టులోకి వచ్చారు.

అలాగే, మిడ్‌ఫీల్డర్ వైష్ణవి విఠల్ ఫాల్కే కూడా పునరాగమనం చేసింది. ముందుగా జర్మనీలో పర్యటించనున్న భారత మహిళలు ఈ నెల 16 నుంచి 19 వరకు చైనాతో ఒక మ్యాచ్, జర్మనీతో రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. అనంతరం నాలుగు దేశాల టోర్నీ కోసం స్పెయిన్‌కు వెళ్లనున్నారు. అక్కడ జూలై 25 నుంచి 30 మధ్య సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, స్పెయిన్‌తో టీమ్ ఇండియా తలపడాల్సి ఉంటుంది. ఆసియా గేమ్స్‌ ముందు ఈ రెండు పర్యటనలు భారత జట్టుకు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి.

భారత మహిళల హాకీ జట్టు:

గోల్‌కీపర్లు : సవిత(కెప్టెన్), బిచు దేవి ఖరీబం, డిఫెండర్లు : దీప్ గ్రేస్ ఎక్కా, నిక్కి ప్రదాన్, ఇషికా చౌదరీ, ఉదిత, సుశీల చాను

మిడ్‌ఫీల్డర్లు : నిశా, మౌనిక, సలీమా టెటె, నేహా, నవ్‌నీత్ కౌర్, సోనిక, బల్జీత్ కౌర్, వైష్ణవి విఠల్ పాల్కే, జ్యోతి ఛత్రి

ఫార్వర్డులు : లాల్‌రెంసియామి, వందన కటారియా, సంగీత కుమారి, దీపిక.

Advertisement

Next Story

Most Viewed