Harmanpreet Kaur: టీమిండియా కెప్టెన్‌‌కు బిగ్ షాక్.. ఐసీసీ భారీ జరిమనా

by Vinod kumar |
Harmanpreet Kaur: టీమిండియా కెప్టెన్‌‌కు బిగ్ షాక్.. ఐసీసీ భారీ జరిమనా
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌తో నిన్న (జులై 22) జరిగిన మూడో వన్డేలో అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ.. బ్యాట్‌తో వికెట్లను కొట్టిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై ఐసీసీ చర్యలు తీసుకున్నది. హార్మన్‌కు ఐసీసీ జరిమనా విధించింది. హర్మన్‌ తీరును దురుసు ప్రవర్తనగా పేర్కొన్న ఐసీసీ.. ఆమె మ్యాచ్‌ ఫీజ్‌లో 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. హర్మన్‌ తీరును దురుసు ప్రవర్తనగా పేర్కొన్న ఐసీసీ.. ఆమె మ్యాచ్‌ ఫీజ్‌లో 75 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. జరిమానాలో 50 శాతం ఆన్‌ ఫీల్డ్‌ దురుసు ప్రవర్తనకు, 25 శాతం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు ఐసీసీ తెలిపింది. 3 డీమెరిట్‌ పాయింట్లు ఆన్‌ ఫీల్డ్‌ దురుసు ప్రవర్తనకు, ఓ డీమెరిట్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరుకు కేటాయించినట్లు వివరించింది.

కాగా, బంగ్లా బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి హర్మన్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‍కు తగలకుండా.. ప్యాడ్‍కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్‍బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్‍ అవతల పిచ్ అయిందని భావించిన హర్మన్‌ అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది. బ్యాట్‍తో వికెట్లను కొట్టడమే కాకుండా.. అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్‌ వైపు వెళ్లింది. హర్మన్‌.. మ్యాచ్‌ అనంతరం ప్రజెంటేషన్‌ సెర్మనీ సందర్భంగా బంగ్లాదేశ్‌ అంపైరింగ్‌ ప్రమాణాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed