రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

by Mahesh |
రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్ట్(Fourth Test) మ్యాచ్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. కాగా కొద్ది రోజుల క్రితం ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గాయం కావడంతో మ్యాచుకు దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. అలాగే ఆస్ట్రేలియా(Australia) స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్(Travis Head) కూడా గాయం కావడంతో నాలుగో టెస్ట్‌కి దూరం అయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే మోకాలి గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ.. బాక్సింగ్ డే టెస్ట్(Boxing Day Test) ఆడుతున్నట్లు స్వయంగా ఆయన చెప్పుకురావడం గుడ్ న్యూస్ కాగా.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్ గా ఉన్నాడని.. ఆయన బాక్సింగ్ డే టెస్ట్ ఆడతాడని కోచ్ ఆండ్రూ మెన్ డొనాల్డ్ వెల్లడించారు. కాగా గత కొద్ది రోజులకు భారత జట్టుకు తలనొప్పిగా మారిన హెడ్ గాయం నుంచి కోలుకున్న నాలుగో టెస్టు(Fourth Test) ఆడుతున్నాడని ప్రకటించడం ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ గా మారింది. కాగా ఐదు మ్యాచులు టెస్ట్ సిరీస్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు చెరో మ్యాచ్ విజయం సాధించగా ఒక మ్యాచును డ్రాగా ముగించాయి.

Advertisement

Next Story

Most Viewed