- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరల్డ్ కప్ మెయిన్ స్వ్కాడ్‌లో గిల్‌కు దక్కని చోటు.. కీలక వ్యాఖ్యలు చేసిన రవిశాస్త్రి
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా, వెస్డిండీస్ వేదికగా జూన్ నెలలో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పొట్టి ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన జట్లు తమ టీమ్‌లను ప్రకటించాయి. ఇందులో భాగంగానే టీమిండియా సైతం 15 మందితో టీ 20 వరల్డ్ కప్ స్కాడ్‌ను అనౌన్స్ చేసింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించగా.. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. అయితే, ఈ వరల్డ్ కప్ మెయిన్ స్వ్కాడ్‌లో టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్‌కు చోటు దక్కలేదు. బీసీసీఐ గిల్‌ను స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో గిల్‌కు ప్రపంచ కప్ మెయిన్ టీమ్‌లో చోటు దక్కకపోవడంతో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యంగ్ ప్లేయర్ గిల్ చాలా టాలెంటెడ్ అని, ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం అతడికి ఉందని కొనియాడారు. అలాంటి సత్తా కలిగిన యంగ్ ఆటగాడికి జట్టులో చోటు దక్కపోవడం బాధకరమన్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోవడం గిల్‌కు కష్టంగా ఉంటుందని.. కచ్చితంగా గిల్ బాధపడుతూ ఉంటాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కానీ ఆటలో ఇవన్నీ సహజమని.. దీనిని పాజిటివ్‌గా తీసుకుని అతడు మరింత ముందుకు దూసుకెళ్లాలని సూచనలు చేశాడు. ఏదైమైనా సత్తా ఉన్న ప్లేయర్‌కు టీమిండియా ప్రపంచ కప్ ప్రధాన జట్టులో చోటు దక్కకపోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసిందన్నారు.