కపిల్ దేవ్‌ సరికొత్త బాధ్యతలు

by Hajipasha |
కపిల్ దేవ్‌ సరికొత్త బాధ్యతలు
X

దిశ,స్పోర్ట్స్ : భారత‌కు క్రికెట్‌లో తొలిసారి వరల్డ్ కప్ అందించిన టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సరికొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) నూతన అధ్యక్షుడిగా ఆయన ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలోనే హెచ్‌ఆర్ శ్రీనివాసన్ స్థానంలో కపిల్ దేవ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. పీజీటీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక కపిల్ దేవ్ మాట్లాడుతూ..‘పీజీటీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. గత కొన్నేళ్లుగా ఆర్గనైజేషన్‌తో కలిసి పనిచేస్తున్నా. ఇది ప్లేయర్లకు మద్దతుగా నిలిచే సంఘం. చాలా ఏళ్లుగా నేను గోల్ఫ్ ఆడుతున్నా. తప్పకుండా నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. నా స్నేహితులతో గోల్ఫ్ ఆడేందుకు ఇంకాస్త అదనపు సమయం దొరికిందని భావిస్తున్నా’ అని కపిల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed