శంషాబాద్ లో డీఆర్ఐ అధికారుల తనిఖీలు… ఒకరు అరెస్ట్

by Kalyani |
శంషాబాద్ లో డీఆర్ఐ అధికారుల తనిఖీలు… ఒకరు అరెస్ట్
X

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయం వచ్చాడు. శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ముందస్తు సమాచారంతో ప్రయాణికున్ని అడ్డగించి తనిఖీలు నిర్వహించగా ప్రయాణికుని లగేజీ బ్యాగులో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. అతనే ట్రాలీ లగేజ్ బ్యాగు కవర్ లో విదేశీ కరెన్సీ చుట్టి బ్యాగులోని కింది భాగంలో అమర్చి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించాడు. ఆ ప్రయాణికుని వద్ద నుంచి (యూఎస్ డాలర్లు) 67 లక్షల 11 వేల 250 గోపాల విలువ చేసే విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకొని ప్రయాణికునిపై కస్టమ్స్ చట్టం, 1962 నిబంధన ప్రకారం ప్రయాణికున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Next Story

Most Viewed