- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ జగన్‌కు మరో షాక్.. ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అమరావతి వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులతో సమీక్ష నిర్వమించారు. ఈ సమీక్షలో మున్సిపల్ మంత్రి నారాయణ పాల్గొన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
కాగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. ప్రపంచంలో నాలుగో రాజధాని ఏపీకి ఉండాలని ఇప్పటికే ఆయన ఆక్షాంక్షించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే అమరావతిలో అడుగు పెట్టి రాజధాని ఇదేననే నమ్మకాన్ని కలిగించారు. క్షేత్రస్థాయిలో అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అలాగే అమరావతి విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి వాస్తవ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ మేరకు బుధవారం శ్వేతపత్రం విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పోలవరంపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానిపై శ్వేతపత్రం విడుదల చేసి గత సీఎం జగన్‌కు మరోసారి షాక్ ఇవ్వనున్నారు.