పోకిరిలకు అడ్డాగా మారుతున్న ఉప్పల్ హెచ్ఎండీఏ లేఅవుట్

by Aamani |
పోకిరిలకు అడ్డాగా మారుతున్న ఉప్పల్  హెచ్ఎండీఏ లేఅవుట్
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ హెచ్ఎండీఏ లేఅవుట్ లో ఫేక్ మర్డర్లు సృష్టించిన సంఘటనలు,అప్పుడే పుట్టిన పసికందు పిల్లలను చెత్త పొదల్లో పడేసిన ఘటనలు,రాత్రి వేళల్లో పోకిరీలు గంజాయి, మద్యం సేవించి ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తు అరెస్ట్ అయిన సంఘటనలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్ఎండిఏ లేఔట్ లో జరిగాయి. పోలీసుల గస్తీ మాత్రం శూన్యం అని చెప్పవచ్చు.ఉప్పల్ హెచ్ఎండిఏ లేఔట్ లో దాదాపు 860 ఎకరాల భూమిని గత తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ కు తీసుకుని భూమి యజమానులకు ఒక ఎకరానికి 1000 గజాల చొప్పున ప్లాట్ లను కేటాయించారు.

అయితే హెచ్ఎండిఏ లే ఔట్ లో కొంతవరకు బిల్డింగ్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నవి. మరికొన్ని అనుమతులకు విరుద్ధంగా షాపులు, హోటల్స్,వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి.ఖాళీగా ఉన్న ప్లాట్ లల్లో చెట్లు పెరగడం తో రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉంటుంది. రాత్రి సమయంలో జంట కనబడితే చాలు పోకిరిలు ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి.పోకిరీలు రోడ్డు పైనే విచ్చలవిడిగా గంజాయి, మద్యం సేవిస్తూ వచ్చిపోయే వారిని బెదిరిస్తున్నారు.అంతేకాకుండా గతంలో కూడా హెచ్ఎండిఏ లే ఔట్ లో ఒక వ్యక్తి కత్తులతో పొడిపించుకొని ఫేక్ మర్డర్ సృష్టించిన సంఘటన కూడా హెచ్ఎండీఏ లేఅవుట్ లోనే జరిగింది. అప్పుడే పుట్టిన పసికందు పిల్లలను చెట్ల పొదల్లో విడిచిపెట్టిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.ఇంత జరుగుతున్న కూడా నిఘా కేంద్రాలు లేకపోవడమే పోకిరీలకు అడ్డాగా మారిందని స్థానిక ప్రజలు అంటున్నారు.

కరువైన పోలీస్ పెట్రోలింగ్..

ఉప్పల్ భగాయత్ లో రోజు రోజుకి పోకిరిల ఆగడాలో మితిమీరి పోతున్నాయి. పగలు,రాత్రి అనే తేడా లేకుండా రోడ్డు మీదనే మద్యం సేవించడం గంజాయి కొట్టడం లాంటివి జరుగుతున్నవి.ఇంత జరుగుతున్న కూడా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.రాత్రిపూట జంటలు కనబడితే చాలు చెప్పనవసరం లేదు వారిని ఫోటోలు,వీడియోలు తీసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు డబ్బులు వసూలు చేస్తున్నారు. పెట్రోలింగ్ సరిగా లేకపోవడంతో చైన్ స్నాచింగ్ లు కూడా జరుగుతున్నవి.అర్ధరాత్రి రోడ్లపై టిఫిన్ సెంటర్లో,టీ షాపులు విచ్చలవిడిగా ఉండటం వల్లనే మందుబాబులు మద్యం తాగి వచ్చి రోడ్ల పైన గొడవలు చేస్తున్నారు.ఇప్పటికైనా పోలీసులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మందుబాబులు హల్‌చల్..

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నాలుగు నెలల్లో రాత్రి సమయంలో పోకిరీలు మద్యం, గంజాయి సేవించి హల్చల్ చేసిన సంఘటనలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగాయి. రామంతాపూర్,చిల్కానగర్, శాంతినగర్, ఉప్పల్ మాస్టర్ చీప్ దగ్గర మత్తులో కట్టెలతో, రాళ్లతో, బాటిల్ లతో కొట్టుకొని పొడుచుకొని హాస్పిటల్ పాలై పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదయ్యాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు లో చెప్పనవసరం లేదు రాత్రి 12 దాటితే చాలు తోపుడు బండ్ల తో టిఫిన్ సెంటర్లో,చాయి సెంటర్లు అడ్డగోలుగా వెలుస్తున్నాయి మందుబాబులకు అడ్డగా మారిపోయి గొడవలకు దారి తీస్తున్నాయి.ఇంత జరుగుతున్న కూడా పోలీసులు నిఘా ఎందుకు పెట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.రాత్రి సమయంలో సరైన పెట్రోలింగ్ లేకపోవడం వల్లనే రాత్రి వేళల్లో నడుచుకుంటూ వెళ్తున్న వారిని బెదిరించి సెల్ ఫోన్లు దొంగలించడం కాలనీలల్లో అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలు దొంగలించడం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సీపీ తరుణ్ జోషి ప్రత్యేక చొరవ తీసుకుని అర్ధరాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలలో కానీ,రోడ్డుమీద మద్యం,గంజాయి సేవించకుండా గస్తీ పెంచి ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచినం :మల్కాజ్గిరి జోన్ ఏసీపీ చక్రపాణి

రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 11 గంటల తర్వాత ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు ముక్యంగా హోటల్స్, పాన్ షాప్ లు, రోడ్ల పై తోపుడు బండ్లు టిఫిన్ సెంటర్స్, టీ షాప్ లు నడపవద్దని ఏసీపీ చక్రపాణి హెచ్చరించారు.ఉప్పల్ భగాయత్ లో జరుగుతున్న దొంగతనాలు,రోడ్ల పై మద్యం సేవించడం, గంజాయి కొట్టడం, తాగిన మందు బాటిల్స్ ను నడిరోడ్డు పైన పగలకొట్టడం లాంటివి అరికట్టడానికి అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా పోలీసులు మఫ్టీలో 4 టీంలను ఏర్పాటు చేసి ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగకుండా గస్తీ చేస్తున్నామన్నారు.రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎసీపీ చక్రపాణి పేర్కొన్నారు.ప్రత్యేకంగా హెచ్ఎండిఏ లేఔట్ లో ప్రతిరోజు రాత్రి సమయంలో స్పెషల్ టీంలతో గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాత్రి సమయంలో మీ కాలనీలలో లో,బస్తీలలో, ఏరియాలలో అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే పోలీసులకు సమాచారం అందించాలని మల్కాజ్గిరి జోన్ ఏసీపి చక్రపాణి కోరారు.

Next Story

Most Viewed