- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమెరికాను షూటౌట్‌లో ఓడించిన భారత్
దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియాపై విజయంతో ఖాతా తెరిచిన భారత్.. ఆదివారం అమెరికాను ఓడించింది. ఒడిశాలోని రూర్కెలాలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఫలితం షూటౌట్‌లో తేలగా.. అమెరికాపై 1(1)-1(2) తేడాతో భారత్ గెలుపొందింది. ఇరు జట్లు మొదటి నుంచి చక్కటి డిఫెన్స్ ప్రదర్శించడంతో గోల్ కోసం ఎదురుచూపులు తప్పలేదు. రెండో క్వార్టర్‌లో 19వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మల్చడంతో భారత్ మొదట ఖాతా తెరిచింది. అయితే, 45వ నిమిషంలో సెస్సా యాష్లే గోల్ చేయడంతో అమెరికా 1-1తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఏ జట్టూ గోల్ సాధించలేకపోయింది. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీయగా భారత్ రెండు గోల్స్(సోనిక, ముంతాజ్ ఖాన్) చేసింది. ఆ తర్వాత కెప్టెన్, గోల్ కీపర్ సవిత ప్రత్యర్థి దాడులను అడ్డుకుంది. దీంతో అమెరికా ఒక్క గోల్ మాత్రమే చేయడంతో భారత్ గెలుపు తీరాలకు చేరింది. ఈ టోర్నీలో సొంతగడ్డపై భారత్‌కు ఇదే చివరి మ్యాచ్. మే 22న అర్జెంటీనాతో తర్వాతి మ్యాచ్ కోసం బెల్జియం వెళ్లనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో భారత జట్టు ఐదో స్థానంలో ఉన్నది.
- Tags
- #FIH Pro League