- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్యాండిడేట్స్ చెస్ ఛాంపియన్ షిప్ లో ప్రజ్ఞానందకు నిరాశే..!
దిశ, స్పోర్ట్స్: భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద ఎఫ్ఐడీఈ క్యాండిడేట్స్ ఛాంపియన్ షిప్ లో నిరాశ పరిచాడు. రౌండ్- 11లో రెండో సీడ్ ప్లేయర్ హికారు నకమురా చేతిలో ఓటమి పాలయ్యాడు. కెనడాలోని టోరంటోలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో భారత్ తరఫున పురుషుల విభాగంలో ముగ్గురు ప్లేయర్లు తలపడుతున్నాయి. అయితే, రౌండ్ 11లో ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతీ ఓటమి పాలవ్వగా.. మరో ప్లేయర్ గుకేశ్ డ్రాతో ముగించాడు. భారత ప్లేయర్ విదిత్ 60వ ఎత్తుగడలో చేసిన తప్పుతో ఒక్కసారిగా గేమ్ తలకిందులైంది. దాన్నే ఛాన్స్ గా తీసుకున్న రష్యా ప్లేయర్ ఇయాన్.. చెక్ మేట్ చేశాడు. దీంతో విదిత్ ఓడిపోవాల్సి వచ్చింది. మరోవైపు ప్రజ్ఞానంద- నకుమురా మధ్య టఫ్ ఫైట్ కన్పించినా.. చివరికి నకుమురానే గెలిచాడు. కరువనాపై గుకేష్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. చివరికి ఇద్దరి మధ్య మ్యాచ్ డ్రాగా మిగిలిపోయింది. ఇక, నకుమురాతో గుకేశ్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే, ముగ్గురు భారత ప్లేయర్లు వైట్ సైట్ నుంచి ఆడటం గమనార్హం.