- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీమిండియాకు అఫీషియల్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'
దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2024 సమీపిస్తున్న వేళ బీసీసీ కీలక ప్రకటన చేసింది. టీమిండియా అఫీషియల్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11' వ్యవహరించనుంది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, డ్రీమ్ స్పోర్ట్స్ సహ యజమాని, సీఈవో హర్ష్ జైన్ వివరాలు వెల్లడించారు. ఇక నుంచి డ్రీమ్ 11 లోగోతో భారత ఆటగాళ్లు మైదానంలోకి బరిలోకి దిగుతారు. ఇప్పటి వరకు టీమిండియాకు స్పాన్సర్ ఉన్న బైజూస్ సంస్థతో ఒప్పందం ముగిసింది.
దీంతో మూడేళ్ల కాలానికి 'డ్రీమ్ 11' సంస్థకు స్పాన్సర్ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాదిలోనే ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. బీసీసీఐ, డ్రీమ్ 11 భాగస్వామ్యం తప్పకుండా అభిమానులకు చేరువుతుందని భావిస్తున్నానంటూ బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆశాభావం వ్యక్తం చేశారు. కొద్ది కాలం పాటు భారత క్రికెట్ జట్టు, బీసీసీఐతో భాగస్వామిగా ఉన్నాం. మళ్లీ టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరించడం థ్రిల్లింగ్‌గా ఉందని డ్రీమ్ స్పోర్ట్స్ సీఈవో హర్ష్ జైన్ వెల్లడించారు.