- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ క్యాప్ నాకెంతో సెంటిమెంట్.. దయచేసి ఇచ్చేయండి : David Warner
దిశ, వెబ్‌డెస్క్ : సిడ్నీ వేదికగా జనవరి 3వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య చివరి టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ ముంగిట వార్నర్‌కు షాక్ తగిలింది. అతడి బ్యాగీ గ్రీన్ క్యాప్‌ని పొగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ‘‘మెల్బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో లగేజ్ నుంచి నా బ్యాక్‌ప్యాక్‌ను (బ్యాగ్)ని ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులు ఉన్నాయి. నా బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. దానిని ధరించి నా చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నా. కావాలని ఎవరైనా బ్యాక్‌ప్యాక్‌ను తీసుకుంటే వారికి మరో బ్యాక్‌ప్యాక్ ఇస్తాను. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికి గురిచేయను. ఎయిర్పోర్ట్, హోటల్ సిబ్బందిని కూడా అడిగాను. సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించాం. ఎక్కడ దాని జాడ దొరకలేదు. దయచేసి నా బ్యాగీ గ్రీన్ క్యాప్‌ని తిరిగి ఇస్తే ఎంతో ఆనందిస్తా’’ అని వార్నర్ విజ్ఞప్తి చేశాడు.