- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన గుకేశ్.. క్యాండిడేట్స్ చెస్ టైటిల్ కైవసం
దిశ, స్పోర్ట్స్ : భారత యువ గ్రాండ్‌మాస్టర్ డి.గుకేశ్ చరిత్ర సృష్టించాడు. కెనడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన చివరిదైన 14 రౌండ్‌లో గుకేశ్ అమెరికా ప్లేయర్ హికారు నకమురాతో డ్రా చేసుకున్నాడు. నల్ల పావులతో ఆడిన అతను 71 ఎత్తుల్లో పాయింట్లు పంచుకున్నాడు. దీంతో గుకేశ్ 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుని టైటిల్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు, ఇయాన్ నెపోమ్నియాషి(రష్యా), ఫాబియానో కరువానా(అమెరికా) మధ్య జరిగిన గేమ్ కూడా డ్రా అవడంతో వారిద్దరూ చెరో 8.5 పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టారు. దీంతో గుకేశ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా విజేతగా నిలిచాడు.
17 ఏళ్ల గుకేశ్ ఈ టైటిల్ గెలిచిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. అంతేకాకుండా, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టైటిల్ దక్కించుకున్న రెండో భారత ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఆనంద్ 2014లో విజేతగా నిలిచాడు. క్యాండిడేట్స్ టోర్నీలో గెలుపొందడంతో గుకేశ్ వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. అక్కడ ప్రస్తుత వరల్డ్ చాంపియన్ డింగ్ లిరెన్(చైనా)తో అతను తలపడనున్నాడు.
మరోవైపు, 14వ రౌండ్‌లో ప్రజ్ఞానంద అజెర్‌బైజాన్ ప్లేయర్ నిజత్ అబాసోవ్‌పై గెలుపొందగా.. మరో గేమ్‌లో అలిరెజా ఫిరౌజ్జా(ఫ్రాన్స్)తో విదిత్ సంతోశ్ డ్రా చేసుకున్నాడు. ప్రజ్ఞానంద(7.0), విదిత్(6.0) వరుసగా మూడో, నాలుగు స్థానాలతో టోర్నీని ముగించారు. మహిళల విభాగంలో చైనా క్రీడాకారిణి టాన్ ఝెంగీ 9 పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత క్రీడాకారిణులు కోనేరు హంపి, ఆర్.వైశాలి చెరో 7.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఆఖరి రౌండ్‌లో కాటెరినా లగ్నో(రష్యా)పై నెగ్గడం ద్వారా వైశాలి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. మరో గేమ్‌లో లీ టింగ్జీ(చైనా)తో కోనేరు హంపి డ్రా చేసుకుంది.