భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు

by Harish |
భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. తాజాగా సీఏ క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ పీటర్ రోచ్ మాట్లాడుతూ..‘మా అభిమానులను ఎంగేజ్ చేసే మ్యాచ్‌ల కోసం మేం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాం. నిజం చెప్పాలంటే భారత్, పాక్‌ జట్లు తమ దేశంలో పోటీపడాలని ప్రతి దేశమూ కోరుకుంటుంది.’ అని తెలిపారు. భారత్, పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆతిథ్యమివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ తెలిపారు. అందుకోసం తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. 2012-13లో చివరి ద్వైపాక్షిక సిరీస్‌కు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత ఇరు జట్లు ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే ఎదురుపడుతున్నాయి. గతేడాది భారత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇరు జట్లు చివరిసారిగా తలపడ్డాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన గ్రూపు మ్యాచ్‌లో పాక్‌ను టీమ్ ఇండియా చిత్తుగా ఓడించింది. ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో జూన్ 9న భారత్, పాక్ జట్లు తలపడబోతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed