చేతన్ శర్మ గేమ్ ఓవర్.. బీసీసీఐ స్టింగ్ ఆపరేషన్‌..!

by Mahesh |   ( Updated:2023-02-15 07:05:48.0  )
చేతన్ శర్మ గేమ్ ఓవర్.. బీసీసీఐ స్టింగ్ ఆపరేషన్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారత క్రికెట్ జట్టు క్లాసిఫైడ్ సెలక్షన్ విషయాలపై చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. జాతీయ సెలెక్టర్లు కాంట్రాక్టుకు కట్టుబడి ఉంటారని, మీడియాతో మాట్లాడకూడదని రూల్ ఉంది. దీంతో అతను రూల్స్ అధిగమించడంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు స్టింగ్ ఆపరేషన్‌ను బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో చేతన్ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై బీసీసీఐ సెక్రటరీ జే షా పిలుపునిచ్చారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా చేతన్ శర్మ గేమ్ ఓవర్ అయిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Next Story