- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో అగ్రస్థానంలో గుకేశ్
దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 11వ రౌండ్‌లో డ్రా చేసుకోవడంతో రెండో స్థానానికి పడిపోయిన అతను శుక్రవారం టాప్ పొజిషన్‌ను దక్కించుకున్నాడు. 12వ రౌండ్‌లో గుకేశ్ అజర్‌బైజాన్‌కు చెందిన నిజత్ అబాసోవ్‌పై విజయం సాధించాడు. నల్లపావులతో ఆడిన అతను 57 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట ముగించాడు. దీంతో 7.5 పాయింట్లతో గుకేశ్ హికారు నకమురా(అమెరికా), ఇయాన్ నెపోమ్నియాచ్చి(రష్యా)లతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకున్నాడు.
మరో మ్యాచ్‌లో ఇయాన్ నెపోమ్నియాచ్చితో ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. 55 ఎత్తుల్లో ఇద్దరు పాయింట్లు పంచుకున్నారు. మరో భారత క్రీడాకారుడు విదిత్ గుజరాతి వరుసగా రెండో ఓటమిని పొందాడు. ఫాబియానో కరువానా(అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ప్రజ్ఞానంద మూడో స్థానంలో, విదిత్ 4వ స్థానంలో ఉన్నారు. మరోవైపు, మహిళల విభాగంలో ఆర్.వైశాలి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. 12వ రౌండ్‌లో ఆమె అన్నా ముజిచిక్(ఉక్రెయిన్)పై 57 ఎత్తుల్లో పైచేయి సాధించింది. భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి 12 రౌండ్‌లో డ్రా చేసుకుంది. అలెగ్జాండ్రియా గోరియాచ్కినా(రష్యా)తో కలిసి 25 ఎత్తుల్లో పాయింట్లు పంచుకుంది.