- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. మూడు నెలలు కెప్టెన్ దూరం
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ దాదాపు మూడు నెలలు ఆటకు దూరం కానున్నాడు. స్టోక్స్ గాయపడటమే అందుకు కారణం. ఇటీవల న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో స్టోక్స్ గాయపడ్డాడు. అతని ఎడమ తొడ కండరాల్లో చీలిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే జనవరిలో అతను సర్జరీ చేయించుకోనున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం వెల్లడించింది. అలాగే, అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దాదాపు మూడు నెలలు దూరంకానున్నట్టు తెలిపింది.
వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఈసీబీ ఇటీవల ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో స్టోక్స్ చోటు దక్కలేదు. గాయం కారణంగా అతను టోర్నీ దూరమవుతున్నట్టు ఈసీబీ తెలిపింది. తరుచగా స్టోక్స్ దీర్ఘ కాలిక గాయాలతో సతమతమవుతున్నాడు. గతేడాది అక్టోబర్‌లో మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఏడాది ఆగస్టులో తొడకండరాల గాయంతో ఇంగ్లాండ్ సమ్మర్ సీజన్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్-2024 నుంచి తప్పుకున్నాడు. తాజా గాయం కారణంగా ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీతోపాటు భారత్ పర్యటనకు అందుబాటులో లేకుండా పోయాడు. అలాగే, మెగా వేలంలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడంతో వచ్చే ఏడాదే కాకుండా ఆ తర్వాతి సీజన్ కూడా స్టోక్స్ దూరంకానున్నాడు.
- Tags
- #Ben Stokes