- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వన్డే సిరీస్ బంగ్లాదే.. నిర్ణయాత్మక మూడో వన్డేలో శ్రీలంక ఓటమి
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. సోమవారం చటోగ్రామ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో శ్రీలంకను 4 వికెట్ల తేడాతో ఓడించి 2-1తో సిరీస్‌ను దక్కించుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 235 పరుగులు చేసి ఆలౌటైంది. జనిత్ లియనాగే(101 నాటౌట్) అజేయ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అసలంక(37) విలువైన పరుగులు జోడించగా.. మిగతా వారు విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు, ముస్తాఫిజుర్, మెహిదీ హసన్ మిరాజ్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. అనంతరం 236 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 40.2 ఓవర్లలోనే ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. ఓపెనర్ తాంజిద్ హసన్(84) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రషీద్ హుస్సేన్ (48 నాటౌట్, 18 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించడంతో బంగ్లా విజయం తేలికైంది. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 4 వికెట్లతో సత్తాచాటాడు.