- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తొలి టెస్టులో బంగ్లాను చిత్తుగా ఓడించిన శ్రీలంక
దిశ, స్పోర్ట్స్ :బంగ్లాదేశ్ గడ్డపై ఆతిథ్య జట్టుతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక తొలి టెస్టును సొంతం చేసుకుంది. సిల్హెట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సోమవారం 328 పరుగుల తేడాతో బంగ్లాపై భారీ విజయం అందుకుంది. లంక జట్టు నిర్దేశించిన 511 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 182 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో మూడో రోజే 47/5 స్కోరుతో తడబడిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరుకు 135 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది.
కసున్ రజిత(5/56) ఐదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మోమినుల్ హక్(87 నాటౌట్) చివరి వరకు నిలిచినా.. భారీ లక్ష్యం ముందు అతని పోరాటం సరిపోలేదు. మిగతా బ్యాటర్లు క్రీజులో నిలువకపోవడంతో బంగ్లా ఘోర ఓటమిని చవిచూసింది. లంక బౌలర్లలో కసున్ రజిత ఐదు వికెట్లతో చెలరేగగా.. విశ్వ ఫెర్నాండో 3 వికెట్లు, లాహిరు కుమార్ 2 వికెట్లు పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు బాది లంక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధనంజయ డి సిల్వ(102, 108)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో శ్రీలంక సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇరు జట్లు రెండో టెస్టులో తలపడనున్నాయి.