Australian Open tennis: క్వార్టర్స్‌లో జొకోవిచ్, సిట్సిపాస్

by Harish |   ( Updated:2023-01-23 14:25:51.0  )
Australian Open tennis: క్వార్టర్స్‌లో జొకోవిచ్, సిట్సిపాస్
X

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. గెలుస్తారనుకున్న చాలా మంది ప్లేయర్స్ ఇంటి ముఖం పట్టారు. కాగా అనామక ప్లేయర్స్ టైటిల్ దిశగా దూసుకెళుతున్నారు. దీంతో టైటిల్ విన్నర్ ఎవరో చెప్పడం కష్టంగా మారింది. అయితే మాజీ నంబర్ వన్ నోవక్ జకోవిచ్ మాత్రం ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్నాడు. సోమవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో జకోవిచ్ 6-2, 6-1. 6-2తో డి మినౌర్‌పై వరుస సెట్లలో గెలిచాడు.

మరోవైపు మూడో నంబర్ సీడ్ సిట్సిపాస్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో సిట్సిపాస్ 6-4, 6-4, 3-6, 4-6, 6-3తో సిన్నర్‌పై చెమడోట్చి నెగ్గాడు. ఇతర మ్యాచ్‌లలో లెహెక్క 4-6, 6-3, 7-6, 7-6 తో ఆగర్ అలస్సిమిని చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌లో రెబ్లెవ్ 6-3, 3-6, 6-3, 4-6, 7-6తో రెనెపై గెలిచాడు. ఇంకో మ్యాచ్‌లో షెల్టన్ విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షెల్టన్ 6-7, 6-2, 6-7,7-6, 6-2తో వోల్ఫ్‌ను చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌లో టి. పాల్ 6-2, 4-6, 6-2, 7-5తో బాటిస్టా ఆగట్‌పై గెలిచాడు.

ఇక మహిళల సింగిల్స్ విషయానికొస్తే... థర్డ్ సీడ్ పెగుల 7-6, 6-2తో బార్బొరా క్రెజికోవాపై వరుస సెట్లలో గెలిచింది. తొలి సెట్‌లో పోరాడిన పెగుల రెండో సెట్‌లో ప్రత్యర్థిపై సునాయాసంగా విజయం సాధించింది. ఐదో సీడ్ ప్లేయర్ సబలెంక కూడా క్వార్టర్స్‌కుచేరుకుంది. నాలుగోరౌండ్ మ్యాచ్‌లో 7-5, 6-2తో బెనాలను చిత్తు చేసింది. మరో మ్యాచ్‌లో ఒస్టాపెంకో 7-8, 6-3తో గాఫ్‌పై విజయం సాధించింది.

మాజీ నెంబర్ వన్ విక్టోరియా అజరెంకా కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో అజరెంకా 6-4, 6-1, 6-4తో చైనాకు చెందిన లిన్ ఝుపై పోరాడి గెలిచింది. మరో మ్యాచ్‌లో ప్లిస్కోవా 6-0, 6-4తో చైనాకే చెందిన షుయ్ ఝాంగ్‌ను వరుస సెట్లలో ఓడించింది. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కరోలిన్ గార్సియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో 7-6, 6-4తో లినెట్టె పోరాడి గెలిచింది. మరో మ్యాచ్‌లో వెకిక్ 6-1, 1-6, 6-3తో ఫ్రుహిర్తోవాను చిత్తు చేసింది.

Advertisement

Next Story