మూడో రోజు ముగిసిన ఆట.. కష్టాల్లో భారత్

by Mahesh |
మూడో రోజు ముగిసిన ఆట.. కష్టాల్లో భారత్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతంది. ఈ మ్యాచ్ మొదటి రోజు వర్షం కారణంగా తక్కువ పరుగులకే ముగిసింది. అనంతరం రెండో రోజూ పూర్తి మ్యాచ్ జరగ్గా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఆదిపత్యం కొనసాగించారు. హెడ్ 152, స్మిత్ 101, అలెక్స్ కేరీ 70, పరుగలుతో రాణించారు. కాగా మూడో రోజు మొదట్లోనే భారత బౌలర్లు తమ సత్తా చాటడంతో ఆస్ట్రేలియా జట్టు 117.1 ఓవర్లకు 445 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు తీసుకోగా.. సిరజ్ 2, ఆకాష్ దీప్, నితిష్ రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఆస్ట్రేలియా బౌలింగ్ దాటికి కుప్ప కూలిపోయింది.

నాలుగు పరుగుల వద్ద జైస్వాల్, 6 పరుగుల వద్ద గిల్, 22 పరుగుల వద్ద కొహ్లి, 44 పరుగుల వద్ద పంత్ అవుట్ అయ్యారు. ఇదిలా ఉంటే భారత్ మొదటి ఇన్నింగ్స్ కు అడుగడుగునా వర్షం అడ్డంకిగా మారింది. లంచ్ బ్రేక్ ముందు రెండు సార్లు మ్యాచ్ నిలిచిపోగా ఆ తర్వాత కొద్ది ఓవర్లకే మరోసారి వర్షం పడింది. దీంతో టీ బ్రేక్ ప్రకటించిగా చివర్లో మ్యాచ్ ప్రారంభం కాగా అప్పటికే సమయం ముగియడంతో మ్యాచును నిలిపి వేశారు. కాగా ప్రస్తుతం భారత్ మూడో రోజు 17 ఓవర్లు ఆడి.. 4 కీలక వికట్లను కోల్పోయి 51 పరుగులు మాత్రమే చేసింది. కాగా ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 33, రోహిత్ శర్మ 0 పరుగుల వద్ద కొనసాగుతున్నారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 394 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed