- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జ్యోతి, సాత్విక్ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం
దిశ, స్పోర్ట్స్ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ అథ్లెట్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి(బ్యాడ్మింటన్), జ్యోతి యర్రాజి(అథ్లెటిక్స్) శిక్షణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మిషన్ ఒలింపిక్ సెల్(ఎంఓసీ) గురువారం ఆమోదం తెలిపింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు శిక్షణకు ఆర్థిక మద్దతు కోసం వీరు ప్రతిపాదనలు పంపగా తాజాగా ఆమోదం లభించింది. దీంతో జ్యోతి 45 రోజుల ట్రైనింగ్ కోసం స్పెయిన్‌కు వెళ్లనుంది. టార్గెట్ ఒలింపిక్ పొడియం స్కీమ్ కింద ప్రయాణ ఖర్చులు, వీసా అప్లికేషన్ ఫీజు, బస, సౌకర్యాలతోపాటు ఇతర ఖర్చులను కేంద్రం భరించనుంది. అలాగే, బ్యాడ్మింటన్‌లో వరల్డ్ నం.1 పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ శెట్టి జోడీ శిక్షణకు కూడా ఆమోదం తెలిపింది. జూన్‌లో ముంబైలో, జూలైలో హైదరాబాద్‌లో సాత్విక్ జోడీ శిక్షణ తీసుకోనుంది. అలాగే, ఇటలీలో ట్రైనింగ్‌కు భారత షూటర్లు రైజా దిల్లాన్, రాజేశ్వరి కుమారి అభ్యర్థనను ఎంఓసీ అంగీకరించింది. కొరియాలో జరగబోయే వరల్డ్ కప్ కోసం పారా షూటర్లు రాహుల్ జఖర్, రుబీనా ఫ్రాన్సిస్ ఆర్థిక మద్దతు కోరగా ఎంఓసీ ఆమోదం తెలిపింది.