Asia Cup 2023: చెలరేగిన శ్రీలంక యువ బౌలర్.. లంక ముందు ఈజీ టార్గెట్

by Vinod kumar |   ( Updated:2023-09-06 06:02:21.0  )
Asia Cup 2023: చెలరేగిన శ్రీలంక యువ బౌలర్.. లంక ముందు ఈజీ టార్గెట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2023 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 42.4 ఓవర్‌లో 164 రన్స్‌కే ఆలౌట్ అయింది. శ్రీలంక యువ బౌలర్ పతిరణ 4 వికెట్లతో చెలరేగగా.. తీక్షణ 2, వెల్లలాగే, శనక, ధనంజయ చెరో వికెట్ తీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో నజ్యుల్ (89) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ షకీబల్ హసన్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. అలాగే వెటరన్ ముష్ఫికర్ రెహ్మాన్ (13), మెహదీ హసన్ మిరాజ్ (5), మెహదీ హసన్ (6), టస్కిన్ అహ్మద్ (0), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (0), షోరిఫుల్ ఇస్లామ్ (2 నాటౌట్) ఒక్కరు కూడా ఆకట్టుకోలేదు. బంగ్లా బ్యాటర్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారంటేనే వారి బ్యాటింగ్ ఎంత ఘోరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Next Story