భారత్‌కి ముంపు పొంచి ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్

by karthikeya |
భారత్‌కి ముంపు పొంచి ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట, గైరవం మరింత పెరిగాయని, కానీ దుష్ట కుట్రలు దేశ సంకల్పాన్ని పరీక్షిస్తున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నాగ్‌పూర్ వేదికగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన కీలక ప్రసంగం ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో భారత్‌కి ముప్పు పొంచి ఉందని, రక్షణగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చేతులు కలుపొచ్చని ప్రచారం జరుగుతోందన్న ఆయన.. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. లేకున్నా మనలో ఉండే జాతీయ స్వభావం ఎంత దృఢంగా ఉందనే దానిపైనే మన విజయం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

‘‘ఏ దేశమైనా ఆ దేశంలోని ప్రజల జాతీయ స్వభావాన్ని బట్టి గొప్పగా మారుతుంది. మన దేశం కూడా ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ముందుకెళుతున్నా.. ఆ మార్గంలో అనేక సవాళ్లు, సమస్యలు కూడా ఉన్నాయి. సంక్షేమం, ధర్మం, సంస్కృతి, సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేసిన ల్యాబాయి హోల్కర్, దయానంద సరస్వతి, బిర్సా ముండా, మరెన్నో వ్యక్తుల నుండి మనం ప్రేరణ పొందాలి’’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story