వైరటీ అమ్మవారు..డ్రై ఫ్రూట్స్ ప్రత్యేక అలంకరణ

by Naveena |
వైరటీ అమ్మవారు..డ్రై ఫ్రూట్స్ ప్రత్యేక అలంకరణ
X

దిశ ,మేళ్లచెరువు :మేళ్లచెరువులోని నవదుర్గ ఆలయంలో అమ్మవారిని డ్రై ఫ్రూట్స్ తో అలంకరణ భక్తులను ఆకర్షణగా మారింది. మేళ్లచెరువు లోని నవదుర్గ ఆలయంలో దసరా ఉత్సవాలలో భాగంగా..తొమ్మిది రోజు పాటు అమ్మ వారికి వివిధ అవతారాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దశమి సందర్భంగా చండీ ఉపాసకులు కొంకపాక రాధాకృష్ణమూర్తి శర్మ, ఏతవాకిళ్ళ భాను కిరణ్ శర్మల ఆధ్వర్యంలో..ఆలయంలో మహా చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం అమ్మవారిని 20 కేజీల డ్రై ఫ్రూట్స్ తో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షించింది. అలంకరణ చూసేందుకు వందల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed