మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి ఇది కదా అసలైన దసరా..!

by karthikeya |
మెగా, నందమూరి ఫ్యాన్స్‌కి ఇది కదా అసలైన దసరా..!
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ రోజున అటు మెగా అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ విశంభర టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తే.. ఇటు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ నుంచి కూడా మూవీ టీం సూపర్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 10 విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ప్రకటించగా.. తాజాగా రిలీజ్‌ డేట్‌తో ఉన్న రామ్‌చరణ్ పోస్ట్‌ర్‌ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. పోస్టర్‌లో రామ్ చరణ్ పరిగెడుతున్నట్లు ఉండగా.. వెనుక రిలీజ్ డేట్, మూవీ టైటిల్ ఉన్నాయి. ఇక ఈపోస్టర్‌తో ఈ దసరా రోజున మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ఖుషీ లభించినట్లైంది.

ఇదిలా ఉంటే బాలయ్య బాబు కూడా ఈ దసరాకి ఏ మాత్రం తగ్గడం లేదు. బాబీ కొల్లి డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న NBK 109 మూవీని సంక్రాంతికి తీసుకురానున్నట్లు మూవీ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో గుర్రంపై కూర్చున్నట్లున్న బాలయ్య చేతిలోపెద్ద గొడ్డలిని పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ మూవీ టైటిల్‌, టీజర్‌ని దీపావళికి విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed